- Advertisement -
సీఎం కేసీఆర్‌కు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని తెలిపారు డాక్టర్ ప్రమోద్. సీఎంకు టెస్టులు చేసిన అనంతరం మాట్లాడిన డా.ప్రమోద్..ఎడమ చేతి వైపు నొప్పిగా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు.అందుకే పొద్దున ఇంటికి వెళ్లి టెస్ట్ చేశామన్నారు. ఎందుకైనా మంచిదని హాస్పిటల్ కి రమ్మని చెప్పామని…యాంజియో గ్రామీ చేసాము ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పారు. మెడ,మెదడు రెండు టెస్ట్ లు చేసాము నార్మల్ గా ఉన్నాయన్నారు.
నెక్ దగ్గర కొంత పెయిన్ ఉందని సీఎం కేసీఆర్ తెలిపారన్నారు డా.ఎంవీ రావు. బీపీ, షుగర్ సీఎం కేసీఆర్ కి ఉన్నాయి….షుగర్ కొంచెం కంట్రోల్ చేసుకోవాలని చెప్పామన్నారు.కిడ్నీ, లివర్ బాగుందని….వారం రోజుల విశ్రాంతి అవసరం… నెల నెల టెస్టు లు కూడా చేస్తామన్నారు. డే కేర్ అడ్మిషన్ మాత్రమే తీసుకున్నాము..
వారం రోజుల కు ఒక సారి షుగర్ టెస్ట్ చేసుకోవాలని సీఎం కేసీఆర్ కు చెప్పామన్నారు.
- Advertisement -