యష్ చేసే సినిమా పాన్ ఇండియా కాదు.. అంతకు మించి అంటూ ఈ రోజు సోషల్ మీడియాలో యష్ ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు. ఐతే, ఫ్యాన్స్ ఉత్సాహానికి ముఖ్య కారణం ఎట్టకేలకు హీరో యష్ తదుపరి సినిమా ప్రకటన పై క్లారిటీ రావడమే. యష్ పుట్టిన రోజు జనవరి 8. కాగా ఈ రోజున ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉండబోతుందని తెలుస్తోంది. ఈసారి యష్ చేయబోతున్న సినిమా పాన్ ఇండియాను మించి ఉండబోతుందని… ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ తో వర్క్ చేయబోతున్నాడని తెలుస్తోంది.
మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, యష్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ ఖుషీగా ఉన్నారు. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత.. యష్ తన సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక యష్ నుంచి రాబోతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కబోతుంది. ఈ మూవీ షూటింగ్ ను జనవరి ఎండింగ్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు.
పైగా ఈ చిత్రం తన జీవితంలో చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అని యష్ కూడా ఫీల్ అవుతున్నాడు. ఈ సినిమా గురించి యష్ మాట్లాడుతూ.. ‘ కేజీఎఫ్ తర్వాత నా నుంచి రాబోతున్న సినిమా ఇది. అందుకే.. నాకు ఇది సినిమా కంటే ఎక్కువ. ఈ సినిమాకు బాక్సాపీస్ రికార్డులు ముఖ్యం కాదు. బడ్జెట్, ప్రజల అంగీకారం ముఖ్యమని యష్ అన్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఒకే సమయంలో 15 దేశీయ, అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో యష్ మాఫియా డాన్ గా కనిపిస్తాడట.
ఇవి కూడా చదవండి…