రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన మిత్రుడు TSMDC ఎండీ మల్సూర్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు శంకర్ పల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటిన మహాలక్ష్మి గ్రూప్స్ చైర్మన్ యార్లగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం వల్ల మనందరం కూడా చాలా బాధపడుతున్నాము అని ఈ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టారని. అందులో భాగంగా నేను కూడా ఈరోజు చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా నా మిత్రులు డాక్టర్ జయంత్ చల్లా, చైర్మన్ చల్లా నర్సింగ్ హోమ్; చిగురుపాటి కృష్ణప్రసాద్, చైర్మన్ గ్రాండ్ వెల్స్ ఇండియా, సురేష్ రాయుడు, ఎండీ శ్రీనివాస పామ్స్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.