ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్, మెగాస్టార్ చిరంజీవిలకు ఈ మధ్య రోజురోజుకు చాలా గ్యాప్ పెరుగుతుంది. ఇటీవలే నాగబాబు యండమూరి తీవ్రమైన వ్యాఖలు చేసాడు. మెగా ఫ్యామిలీపై కొంతమంది అనవసర కామెంట్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వ్యక్తిత్వ వికాసం పాఠాలు చెప్పుకునే ఒకడు చరణ్ బాబు ను తక్కువ చేసిన మాట్లాడని..ఆయన ఒక రచనా వ్యాసంగ నిపుణుడు. కనిపిస్తే కాళ్లకు దండం పెడతాను. కానీ అతనొక మూర్ఖుడు. వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పే వాడికి అసలువ్యక్తిత్వం లేదు, వాడో కుసంస్కారి అంటూ యండమూరి పై నాగబాబు ఖైదీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో కామెంట్స్ చేశాడు.
ఆ తర్వాత నాగబాబు యండమూరిపై చేసిన కాంమెట్స్‌ను సర్థిపుచ్చుకన్నాడు ఆయనప్పటికీ వీరి మధ్య మళ్లీ వివాదాలు మళ్లీ తలెత్తాయి. ఇటీవలే చిరంజీవి మలో ఎవరు కోటీశ్వరుడు షో లో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షో యండమూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రోగ్రాంపై తీవ్రస్థాయిలో విరుచకపడ్డారు.
‘‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రొగ్రామ్ అతిపెద్ద మోసం అంటూ యండమూరి ఆరోపించారు. ఈషోలో పాల్గొనాలంటే ముందు మూడు మెసేజ్‌లు పంపాలి. ఒక్కో మెసేజ్‌కు ఐదు రూపాయలు ఖర్చవుతుంది. అంటే మూడు మెసేజ్‌లకు 15 రూపాయలు కట్ అవుతుంది. ఒక్కొక్కరు పదిహేను రూపాయలు చెల్లించుకుంటారని…ఈ రకంగా పదిలక్షల మంది మెసేజ్‌లు పంపితే, నిర్వహకుల జేబులోకి రూ.1.5 కోట్లు వెళతాయని యండమూరి తెలిపారు. ఆ తర్వాత పోటీలో పాల్గొనే వారికి కుక్క బిస్కెట్లు వేసినట్టు ఐదు, ఆరు లక్షలు విసురుతారని మండిపడ్డారు. ఆ కుక్క బిస్కెట్లను మనం చొంగ కార్చుకుంటూ తీసుకుంటున్నామని ఆయన విమర్శించారు. చాలా పేదవాళ్లు కూడా ఇలాంటి వాటికి మెసేజ్‌లు పంపించి మోసపోతున్నారు. దీని కంటే లాటరీ టికెట్ కొనడం మేలు. లాటరీలను బ్యాన్ చేసిన ప్రభుత్వం ఇలాంటి గ్యాంబ్లింగ్ ప్రోగ్రామ్‌లను కూడా బ్యాన్ చేయాలని యండమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిరంజీవిపై యండమూరి ఫైర్…..
- Advertisement -
- Advertisement -