హాట్‌ స్టార్‌లో “యక్షిణి”

17
- Advertisement -

ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కాంబినేషన్ లో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “యక్షిణి”. ఈ వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు తేజ మార్ని “యక్షిణి” సిరీస్ ను రూపొందిస్తున్నారు. జూన్ 14న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో “యక్షిణి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు “యక్షిణి” వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ దేవినేని మాట్లాడుతూ – పరంపర తర్వాత డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ తో కలిసి మేము చేస్తున్న రెండో సిరీస్ ఇది. రొమాన్స్, కామెడీ, డ్రామా వంటి అంశాలతో యక్షిణి ఆకట్టుకుంటుంది. డిస్నీ మాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చిందో మేము బడ్జెట్ విషయంలో యక్షిణి టీమ్ కు అంత ఫ్రీడమ్ ఇచ్చాం. ఈ సిరీస్ పూర్తిగా దర్శకుడు తేజ మార్ని విజన్ అని చెప్పాలి. మా ఆర్కా టీమ్ కు, డిస్నీ టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. యక్షిణిలో మంచి కాస్టింగ్ ఉన్నారు. వారంతా సూపర్బ్ గా పర్ ఫార్మ్ చేశారు. యక్షిణి పరంపరను మించిన సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం. యక్షిణి సీజన్ 2 కోసం కూడా ప్లానింగ్ మొదలుపెట్టాం. అన్నారు.

నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ – యక్షిణి వెబ్ సిరీస్ లో జ్వాల క్యారెక్టర్ లో కనిపిస్తాను. ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు ఈ క్యారెక్టర్ నేను తప్ప మరెవరు చేస్తారు అనిపించింది. షూటింగ్ లో ప్రతి రోజూ కొత్తగా అనిపించేది. నేను ఈ సిరీస్ చేయాలని రాసిపెట్టి ఉందని భావిస్తాను. ఆర్కా మీడియా, డిస్నీతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. వేదిక రోజూ ఏం తింటుందో గమనించేదాన్ని. అజయ్ అలా నిల్చుని ఉంటే చాలు పర్ ఫార్మ్ చేసినట్లే. తోటి ఆర్టిస్టులంతా అతనితో పోటీ పడాల్సిఉంటుంది. రాహుల్ విజయ్ ఫాదర్ , మా నాన్న కలిసి సినిమాలు చేశారు. ఇప్పుడు మేము కలిసి సిరీస్ చేయడం సంతోషంగా ఉంది. నేను ఎవరో అవకాశాలు ఇస్తారని వేచి చూడను. అవకాశాలు క్రియేట్ చేసుకుంటా. అందుకే సిరీస్ లు, షోస్ అంటూ ఏదో ఒక వర్క్ లో బిజీగా ఉంటాను. యక్షిణి మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. తప్పకుండా చూడండి. అన్నారు.

నటుడు అజయ్ మాట్లాడుతూ – వెబ్ సిరీస్ లు నటీనటులకు ఒక వరం లాంటివి. ఒక పాత్రను అర్థం చేసుకుని వీలైనంత బాగా పర్ ఫార్మ్ చేసే అవకాశం వెబ్ సిరీస్ లలో దొరుకుతుంది. ఎక్కువకాలం ఆ క్యారెక్టర్స్ తో ట్రావెల్ చేయగలుగుతాం. యక్షిణి నాకు అలాంటి అవకాశం ఇచ్చింది. ఫాంటసీ ఎలిమెంట్స్ తో వచ్చే కమర్షియల్ వెబ్ సిరీస్ లు తెలుగులో చాలా తక్కువ. యక్షిణి అలాంటి జానర్ తో తెరకెక్కింది. ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇచ్చే సిరీస్ ఇది. కన్ఫర్మ్ గా బాగుంటుంది. మా టీమ్ అందరి ముఖాల్లోని కాన్ఫిడెన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. విరూపాక్ష తర్వాత మాంత్రికుడి క్యారెక్టర్స్ చాలా వచ్చాయి కానీ అవన్నీ రిజెక్ట్ చేశాను. దానికి కాస్త దగ్గరగా ఉన్న రోల్ యక్షిణిలో చేశాను. అన్నారు.

Also Read:డైరెక్టర్స్ డే..ప్రభుత్వానికి థ్యాంక్స్

- Advertisement -