ప్ర‌ధాని వంట‌మనిషికి అవ‌మానం…

77
Yadamma
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్ర‌ధానికి తెలంగాణ రుచులు చూయించేందుకు క‌రీం న‌గ‌ర్ కు చెందిన యాద‌మ్మ‌కు ప్ర‌త్యేక ఆహ్వానం అందింది. ఇదే పలు ఆ పార్టీ అనుబంధ పత్రికల్లో ప్రధానంగా ప్రచురించారు.

అయితే తీరా… ప్ర‌ధాని మోడికి వంట చేసేందుకు తీసుకొచ్చిన యాద‌మ్మ‌కు అవ‌మానం జరిగింది. పాస్ లేద‌ని అనుమ‌తి నిరాక‌రించారు పోలీసులు. దీంతో రోడ్ పై బైఠాయించింది యాదమ్మ. తదనంతరం పాసులు తీసుకు వచ్చిన వారి వాహనం లేక పోవడం తో బయటనే ఉండిపోయింది యాదమ్మ. దీనిపై పలువురు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.

- Advertisement -