రేవంత్‌కు పాలేర్లం కాదు: జగ్గారెడ్డి

70
jaggareddy
- Advertisement -

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. బండ కేసీ కొట్టడానికి రేవంత్ ఎవడు … మేము ఏమన్నా పాలేర్లమా..? అని ప్రశ్నించారు. ఏమనుకుంటున్నావూ…. ఎవరిని కొడతవు నువ్వు …టెంప్ట్ అయ్యే వాడివి పిసిసి పోస్ట్ కి అర్హుడు ఎలా అయ్యావు అని ప్రశ్నించారు. వీహెచ్‌ ఎవరు అని అంటున్నావు ..? ఏం లెక్క అది . కాంగ్రెస్ నీ కొనుక్కున్నవా..? అని దుయ్యబట్టారు.

పిసిసి పోస్ట్ దిగి చూడు… నీకేం విలువ ఉంటదని తీవ్రంగా దుయ్యబట్టారు. వీహెచ్‌ వయస్సు ఎక్కడా నీ వయస్సు ఎక్కడా.. రాష్ట్ర పతి ఎన్నికల పై ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడలేదు…. వారం వారం పెట్టాల్సి న కార్యవర్గం లేదన్నారు. ఇంట్లో కూర్చొని డైరెక్షన్ ఇస్తావా..?నువ్వు ఎవడివి… బండకేశి కొడతా అంటే తెలివి ఉందా..?రేవంత్ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.

ఈ విషయంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ల కు లేఖ రాస్తా అన్నారు. సిఎల్పీ డమ్మీ … ఇప్పుడు భట్టి పరేషాన్ లో ఉన్నాడు… ఆయనకు చెప్పకుండా చేరికలు అయ్యాయన్నారు. నువ్వు వచ్చిన తర్వాత పార్టీ కి ఏం రాలేదు…. నువ్వు లేక పోయినా పార్టీ నడిపిస్తాం అన్నారు.

- Advertisement -