యాదాద్రికి ప్రత్యేక పాలకమండలి…

182
- Advertisement -

టీటీడీ తరహాలోనే యాదాద్రికి ప్రత్యేక పాలకమండలిని ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే మంత్రులు, ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఆలయ కార్యనిర్వహణ అధికారిగా ఐఏఎస్‌ అధికారిని నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


అదేవిధంగా యాదాద్రిలో కూడా తిరుమలలో మాదిరిగా బ్రేక్‌ దర్శనాలు, ఆన్‌లైన్‌ దర్శనాలు అమలు చేయనున్నారు. ఈ నెల 28న ఉదయం 11.55 గంటలకు యాదాద్రి ప్రధాన ఆలయాన్ని సీఎం కేసీఆర్ పునఃప్రారంభించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తులకు స్వయంభువుల దర్శనం కల్పించనున్నారు.

యాదాద్రి కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించరు. కొండ కింద యాగశాల ప్రాంగణంలోని పార్కింగ్‌ స్థలంలో వాహనాలు నిలిపి, దేవాలయం తరఫున నడిపే బస్సుల్లో కొండపైకి వచ్చి దర్శనం చేసుకోవాలి. ప్రతి భక్తుడికీ క్యూఆర్‌ కోడ్‌ ఇవ్వనున్నారు.

- Advertisement -