లాక్ డౌన్ 5.0 సడలింపులతో నేటి నుంచి ఆలయాలు తెరచుకున్నాయి. దీంతో యాదాద్రి ఆలయంలో స్వామి వారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు కలెక్టర్ అనిత రాం చంద్రన్. అనంతరం ఆలయములో భక్తుల ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకున్న జాగ్రత్తలు పై పర్యవేక్షించారు.
కొండ పైన క్వరైన్ టెన్ సెంటర్ ఏర్పాటుచేసిన అధికారులు అనారోగ్యంతో వచ్చిన భక్తులను వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నారు.ప్రతి ఒక్క భక్తుడికి థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాతే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. అడుగడుగునా శానిటైజర్ లు ఏర్పాటు చేశారు. భౌతిక దూరం, మాస్క్ లు తప్పనిసరి చేశారు. కరోనా నేపథ్యంలో తీర్థము, తలనీలాలు, పుష్కరిణి పూజలు బంద్ చేశారు.
కోవిడ్ 19 నిబంధనల ప్రకారం భద్రాద్రి శ్రీరామచంద్ర ఆలయం తెరచుకుంది. బాసర పుణ్యక్షేత్రం ప్రారంభంకాగా భౌతిక దూరాన్ని పాటిస్తూ దర్శనం చేసుకుంటున్నారు భక్తులు.
భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద దర్శనం కోసం బారులు తీరారు భక్తులు. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం ఆలయంలోకి భక్తులను అనుమతిస్తుండగా అమ్మవారిని దర్శించుకున్నారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.