రేపటి నుండే యాదగిరీశుడి దర్శనం..

213
yadadri
- Advertisement -

రేపటి నుండి యాదగిరీశుడి దర్శనాలు పునర్ ప్రారంభం కానున్నాయి. 8వ తేదీన ప్రయోగాత్మకంగా స్థానికులకు ఆలయ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు స్వామివారి దర్శనానికి అనుమతివ్వాలని అధికారులు నిర్ణయించారు.

ఈనెల తొమ్మిదో తేదీ నుంచి భక్తులందరికీ దర్శనానికి అనుమతివ్వనున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ దేవస్థానం వారు సూచించిన సూచనల విధంగా స్వామి వారిని దర్శించుకోవాలన్నారు.

గర్భిణీ స్త్రీలు వృద్ధులు 10 సంవత్సరాలలోపు పిల్లలు అనారోగ్యంతో ఉన్న వారికి దర్శనానికి అనుమతించమని తెలిపారు అధికారులు. * తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్ట కరోనా వ్యాధి నివారణలో తగినటువంటి జాగ్రత్తలు ఏర్పాటు చేసిన తర్వాత మొదలవుతుందన్నారు.

- Advertisement -