మార్చి 28న యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణం..

192
kcr
- Advertisement -

సమైక్య పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షకు గురైందని ఆధ్యాత్మికంగా కూడా వెనుకబడిందన్నారు సీఎం కేసీఆర్. యాదాద్రి పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్…అద్భుతమైన చరిత్ర,ఆధ్యాత్మిక సంపద ఉన్న ప్రాంతం తెలంగాణ అన్నారు. రాష్ట్రంలో చాలా విశిష్టమైన దేవాలయాల్లో ఒకటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం అన్నారు.

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అష్టాదశ పీఠాల్లో ఒకటి జోగులాంబ ఒకటన్నారు. స్వరాష్ట్రంలో కృష్ణ పుష్కరాలను అద్భుతంగా నిర్వహించామని ఘాట్‌ల నిర్మాణం చేపట్టామన్నారు. శిల్పారామం సృష్టికర్త కిషన్ రావు అని తెలిపిన సీఎం…వారి ఆధ్వర్యంలోనే యాదాద్రి నిర్మాణం జరిగిందన్నారు.

ఆలయాల ప్రారంభోత్సవం ఆగమ శాస్త్ర నియామకాల ప్రకారమే జరుగుతుందన్నారు. చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఆలయ పునర్‌నిర్మాణం జరిగిందన్నారు. వారి సూచనల ప్రకారమే ఆలయాన్ని తీర్చిదిద్దామని తెలిపారు. యాదాద్రి ఒకప్పుడు కరువుకు ఆనవాళ్లుగా ఉండేదని కానీ నేడు నృసింహస్వామి రిజర్వాయర్ ద్వారా పరిస్థితి మారిందన్నారు. రామానుజ స్వామి జన్మించి వెయ్యి సంవత్సరాలు కావొస్తున్న సందర్భంగా చినజీయర్ స్వామి ఆశ్రమంలో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.

నృసింహస్వామి రిజర్వాయర్‌ ద్వారా యాదాద్రికి నీటి కొరత ఉండదన్నారు. 250 అద్భుతమైన కాటేజీల నిర్మాణం జరుగుతుందన్నారు. మహాకుంభ సంప్రోక్షణం మహా సుదర్శన యాగంతో మొదలవుతుందన్నారు. మార్చి 28న యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణం జరుగుతుందన్నారు.

- Advertisement -