సలార్‌కు తప్పని లీకుల బెడద!

139
Prabhas Salaar
- Advertisement -

భారీ ప్రాజెక్టులకు లీకుల బెడద కామనే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకు వీరులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ప్రభాస్ సలార్ మూవీకి అలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా సినిమాకు సంబంధించి 10 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ యాక్షన్ సీన్ ను జనం చూసి థ్రిల్ ఫీలవుతున్నారు.ప్రభాస్ ‘రాధే శ్యామ్’ జనవరిలో సంక్రాంతి కానుకగా రానుంది. ఇక ‘సలార్’ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ‘రాధే శ్యామ్’ తరువాత రానున్న ‘సలార్’లోని యాక్షన్ ఎపిసోడ్ కావడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

- Advertisement -