గోవర్ధనదారిగా నరసింహస్వామి

247
yadadri
- Advertisement -

యాదాద్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ పొన్న వాహన సేవతో భక్త కొటి పులకించిపోయింది. ఆరో రోజు స్వామివారు గోవర్ధనదారిగా దర్శనమిచ్చారు.

ఒక్కోరోజు ఒక్కో అలంకారం లో స్వామి దర్శనం చూస్తున్న భక్తులు తరించిపోతున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఇక శ్రీ వారు తమ ఇష్ట వాహనాలపై ఊరేగుతూ యాదాద్రి కొండపైన భక్తులకు ప్రతి నిత్యం దర్శనమిస్తున్నారు .

నేటి నుండి ధార్మిక, సంగీత, సాహిత్య మహాసభలు యాదాద్రి వేదికగా బ్రహ్మోత్సవాలలో భాగంగా జరగనున్నాయి. ఇప్పటికే బ్రహ్మోత్సవాల కైంకర్యాల లో భాగంగా నిత్య హోమాలు, చతుర్వేద పారాయణలు, మూల మంత్ర పఠనాలు, ఇక స్వామివారికి నిర్వహించే అలంకరణ సేవ ముందు ప్రబంధ పారాయణం నిర్వహిస్తున్నారు.

యాదాద్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వేద పఠనం, అర్చకుల మంత్రోచ్ఛారణలు, ఋత్విక్కుల వేద పారాయణలతో ఓం నమో నరసింహాయ అంటూ భక్త జనుల జయజయ ధ్వనాలతో మార్మోగిపోతోంది.

- Advertisement -