రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని రెడ్లకు తాను ఏదో మేలు చేసినట్టుగా.. తానేదో త్యాగం చేసినట్టుగా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు మాజీ రెడ్కో ఛైర్మన్ వై సతీష్ రెడ్డి. కానీ ఎస్సీ,ఎస్టీ, బీసీలనే కాదు.. రెడ్లను కూడా తీవ్రంగా మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ రెడ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ ఇప్పుడు ఆయన వారికే ఎక్కువ నష్టం చేస్తున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి పథకాలతో ఎక్కువగా లబ్ధి పొందింది రెడ్లేనన్నారు.
కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. ఆ పథకాలన్నింటికి కోత పడింది. రైతుబంధు, రుణమాఫీ విషయంలో అయితే రెడ్లు తీవ్రంగా నష్టపోయారు. రేవంత్ రెడ్డికి ఓటేస్తే ఏదో మంచి చేస్తాడనుకుంటే.. ఆయన వచ్చి రెడ్ల నెత్తిన భస్మాసుర హస్తంలా తయారయ్యాడు. రెడ్లు ఎప్పుడైనా అన్ని కులాలవాళ్లు బాగుండాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు కొందరు మనుషులను పెట్టి అదే పనిగా రెడ్లను తిట్టించి.. ఇతర కులాలకు, రెడ్లకు మధ్య దూరం పెంచేలా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నారు.
సమాజంలో ఉన్న సామరస్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాడు. రెడ్డి అనే పేరు వింటేనే అసహ్యం కలిగేలా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. రెడ్ల రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత.. భవిష్యత్ లో ప్రజలెవరూ రెడ్లకు ఓటువేసే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే భవిష్యత్ లో రెడ్డి సామాజిక వర్గం బాగుండాలన్నా.. సామరస్యంతో బతుకుతున్న తెలంగాణ పల్లెల్లోని ప్రజలు బాగుండాలన్నా రెడ్లందరు కూడా రేవంత్ రెడ్డిని బహిష్కరించాలన్నారు.
Also Read:వెనక్కి రావాల్సిందే..అక్రమ వలసదారులపై మోదీ

