తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా మీనాక్షి నటరాజన్

13
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా నియమితులయ్యారు మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్. ప్రస్తుత పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో ఆమెను నియమించారు.

మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయిని బిర్లాగ్రామ్ నగ్డాలో జన్మించారు మీనాక్షి. బయో కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయగా ఎన్ఎస్ యూఐ లో చేరిక ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1999 నుంచి 2002 వరకు NSUI అధ్యక్షురాలిగా పనిచేశారు. 2002-2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2008లో AICC కార్యదర్శిగా ఎంపిక కాగా 2009 నుంచి 2014 వరకు మందసౌర్ నుండి ఎంపీగా గెలుపొందారు.

తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంచార్జ్ లను నియమించింది.

Also Read:రెడ్ల భస్మాసుర హస్తం రేవంత్ : సతీష్ రెడ్డి

- Advertisement -