తెలంగాణ బీజేపీ నేతలు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ ధర్మపురి అరవింద్‌కు కేంద్రం భద్రత కల్పించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు వెలువరించింది. ఈటల రాజేందర్ కు వై ప్లస్ కేటగిరీ భద్రతతో పాటు ధర్మపురి అరవింద్ కు వై కేటగిరీ భద్రతను కల్పించింది. వై ప్లస్ కేటగిరీ కింద 11 మంది, వై కేటగిరీ కింద 8 మందితో భద్రత కల్పించనున్నారు.
రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నేతల భద్రత విషయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహానాలను కేటాయించింది.
Also Read:ఎన్టీఆర్ తో పాన్ వరల్డ్ మూవీ!
ఇటీవల ఈటల భార్య జమున తన భర్తను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈటల సైతం తన హత్యకు రూ. 20 కోట్ల డీల్ కుదిరిందని ఆరోపించగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించింది. ఈటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున భద్రత కల్పిస్తామని చెప్పింది. అయితే అంతలోనే కేంద్రం వీరి భద్రతపై నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read:పూరి – ఛార్మి బంధానికి ఇదే కీలకం