- Advertisement -
దేశంలో కరోనా కొత్తవేరియంట్ రోజురోజుకు విస్తరిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 1071 కేసులు నమోదుకాగా అందులో XBB1.16 కేసులే 76. కర్ణాటకలో 30, మహారాష్ట్రలో 29, పుదుచ్చేరిలో 7, ఢిల్లీలో 5, తెలంగాణలో 2, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.
దేశంలో తొలిసారి XBB 1.16 వేరియంట్‌ను తొలిసారి జనవరిలో గుర్తించారు. ఫిబ్రవరిలో 59 నమూనాల్లో ఈ వేరియంట్‌ను కనుగొన్నారు. మార్చిలో ఇప్పటి వరకు XBB 1.16 వేరియంట్ 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదలకు ఈ వేరియంట్ కారణమని నిపుణులు భావిస్తున్నారు.
అయితే XBB 1.16 వేరియంట్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. XBB 1.16 వేరియంట్, ఇన్ ఫ్లూయెంజా కేసుల బారిన పడకుండా రక్షించుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -