ఆ దర్శకుడిని మెప్పించలేకపోయిన రచయిత

32
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని ఓ మూవీ చేయడానికి సిద్ధం అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఇప్పుడు ఓ వార్త హాట్ టాపిక్ అయ్యింది. ప్రసన్నకుమార్ బెజవాడ మంచి మాటల రచయిత. అందులో సందేహం లేదు. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత నుంచి మెప్పు పొందిన రచయిత. సంభాషణ రచయితల్లో మంచి రెమ్యూనరేషన్ అందుకుంటున్న రచయిత కూడా. అలాంటి వాడు దర్శకుడు గోపీచంద్ మలినేని ను ఒప్పించలేకపోయారు..మెప్పించలేకపోయారు. అన్నది ఇప్పుడు ఇన్ సైడ్ టాక్.

నిజానికి దీనికి రెండు వెర్షన్లు వినిపిస్తున్నాయి. ఒకటేమిటంటే, గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ ఐడియా తయారు చేసుకున్నారు. దాని ప్రకారం సంభాషణలు రాయడానికి హీరో రవితేజ, ప్రసన్నకుమార్ బెజవాడను రిఫర్ చేశారు. హీరో చెప్పాడు, కాబట్టి.. ప్రసన్నకుమార్ ను గోపీచంద్ మలినేని తీసుకోవాల్సి వచ్చింది. కాస్త ఎక్కువ టైమ్ తీసుకునే ప్రసన్నకుమార్ బెజవాడ తన వెర్షన్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రసన్నకుమార్ బెజవాడ కు పారితోషికం ఇచ్చి సెటిల్ చేసేసి పంపించారు. మరి ఆ వెర్షన్ వాడుతున్నారా? లేక గోపీచంద్ మలినేని తన వెర్షన్ రాసారా? అన్నది తెలియదు. ఇది ఒక సంగతి.

Also Read:మంత్రిగా పట్నం ప్రమాణస్వీకారం

వినిపిస్తున్న రెండో సంగతి ఏమిటంటే, గోపీచంద్ మలినేని కావాలనే ప్రసన్నకుమార్ బెజవాడ రాసిన వెర్షన్ బాలేదని, అతనికి డబ్బులు ఇచ్చి సెటిల్ చేయించేసారని, తను కరెక్షన్ చేసిన వెర్షన్ తో సినిమా షూట్ చేస్తున్నారని. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, అన్నీ తన పేరిటే వుండాలనే ఆలోచనతో ప్రసన్నకుమార్ బెజవాడ ఇలా చేసారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది నిజం అన్నది తెలియదు కానీ, ప్రసన్నకుమార్ బెజవాడ కు సినిమా ప్రారంభానికి ముందే డబ్బులు ఫైనల్ సెటిల్ మెంట్ చేసేసారన్నది బాగా వినిపిస్తోంది.

Also Read:కామారెడ్డి బరిలో రాములమ్మ..నిలబడేనా?

- Advertisement -