- Advertisement -
గత కొంతకాలంగా చిన్ని సినిమాల హవా టాలీవుడ్‌లో కొనసాగుతుంది.సుహాస్ టీనా శిల్పరాజ్ జంటగా ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రైటర్ పద్మభూషణ్. ప్రేక్షకుల ముందుకు ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా త్వరలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జీ5 ఈసినిమాను దక్కించుకుంది. అయితే మార్చి 17వ తేదీ నుంచి ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి రోహిణి రమణ శ్రీగౌరి ప్రియా తదితరులు కీలకపాత్రలో నటించారు. ఈ సినిమకు అనురాగ్ రెడ్డి మరియు శ్రీరామ చంద్ర నిర్మాతలుగా వ్యవహరించగా… చాయ్ బిస్కెట్ మరియు లహరి ఫిల్మ్స్ బ్యానర్‌లపై తెరకెక్కించారు.
ఇవి కూడా చదవండి…
ఎన్టీఆర్…డౌన్ టూ ఏర్త్ స్టార్!
పిక్ టాక్ :మరీ ఇంత పచ్చిగా దిగిందేంటి?
అభిమాని కోసం ఎన్టీఆర్ !
- Advertisement -