ఎన్టీఆర్‌…డౌన్‌ టూ ఏర్త్‌ స్టార్‌!

39
- Advertisement -

డౌన్‌ టూ ఎర్త్ స్టార్స్ అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్‌ నటుల్లో ఒకరు ఎన్టీఆర్‌. తాజాగా ఆస్కార్ వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఎన్టీఆర్…ఫ్యాన్స్‌తో మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ అభిమాని తల్లిని ఎన్టీఆర్ వీడియో కాల్‌లో సంప్రదించారు. మా అమ్మకు మీరంటే ఎంతో ఇష్టం అన్నా..ఒక్కసారి మాట్లాడతారా? అని అడగ్గా వెంటనే ఎన్టీఆర్ అంగీకరించారు.

ఆవ్యక్తి తన తల్లికి వీడియో కాల్ చేయగా ఆయన్ ఫోన్‌ తీసుకుని ఓ కుటుంబసభ్యుడిలా మాట్లాడారు. ఎలా ఉన్నారమ్మా… నేను బాగున్నాను. తప్పకుండా కలుద్దాం అమ్మా అని కాసేపు మాట్లాడి త్వరలో కలుస్తా అని మాటిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన అభిమానులు ఎన్టీఆర్‌ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.

ఇవి కూడా చదవండి…

పిక్ టాక్ :మరీ ఇంత పచ్చిగా దిగిందేంటి?

CEO గా చరణ్.. టైటిల్ ఫిక్స్ !

‘అవతార్ 2’ ఇంటికొచ్చేస్తుంది

- Advertisement -