కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువు చేసింది రైటర్ పద్మభూషణ్ సినిమా. యంగ్ హీరో సుహాస్ నటించిన ఈ సినిమా…విడుదలై మూడు రోజులకు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.6కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా దాదాపు 2లక్షల డాలర్లకు పైగా కలెక్షన్‌లు వచ్చాయి. అయితే తాజాగా చిత్రబృందం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 38థియేటర్‌లలో నాలుగు షోలలో మహిళలకు ఉచితంగా సినిమాను ప్రదర్శించనుంది. ఈ సినిమాను ఉచితంగా 8వ తేదీన ప్రదర్శించనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అయితే సినిమాను ప్రదర్శించే థియేటర్‌ల లిస్టు ఇంకా బయటకు రాలేదు. చిత్రబృందం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైటర్‌తో పాటుగా మైఖేల్ బుట్టబొమ్మ సినిమాలు విడుదలైన ఆడియెన్స్ మాత్రం ఫ్యామిలీ సినిమాలకే జై కొడుతున్నారు.
ఇవి కూడా చదవండి…