కర్నాటక ఎన్నికల ఫలితాలపై కోన వెంకట్ ట్వీట్..

285
Writer kona venkat tweet on karnataka results
- Advertisement -

హోరాహోరీగా  సాగిన కర్నాటక ఎన్నికల్లో గెలుపు పవనాలు బీజేపీ వైపు వీస్తున్నాయి. ఈ సారి కూడా అధికారాన్ని కాంగ్రెస్ చేపడుతుందని అందరూ ఊహించారు. . కానీ అంచనాలు తారుమారై కర్నాటకలో బీజేపీ గెలుపు దిశగా పయనిస్తుంది. కౌంటింగ్ ప్రారంభంలో గెలుపు కాంగ్రెస్ వైపు కనిపించినా రాను రాను నువ్వా.. నేనా అన్నట్లుగా సాగి ఒక్కసారిగా బీజేపీ అధిక్యంలోకి చేరిపోయింది.

 Writer kona venkat tweet on karnataka results

ఈ ఎన్నికల ఫలితాలపై టాలీవుడ్ పరిశ్రమలో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం సినీ నటుడు నిఖీల్ స్సందించగా తాజాగా రచయిత కోన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కర్నాటకలో ఎన్నికల ఫలితాల్లో భాగాంగా ఈవీఎంలను ఓపెన్ చేయగానే… రిజల్ట్ ప్రతి ఒక్కటీ మోదీకే అన్నట్టుగా వచ్చాయని కోన వెంకట్ తెలిపారు. ‘‘ఎప్పుడైతే ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్)లను ఓపెన్ చేశారో.. అప్పుడే ఫలితాలు ఎవ్రీబడీ ఓటెడ్ ఫర్ మోదీ అని తెలిసిపోయిందని తెలిపి చివరికి నో కామెంట్స్!’’ అంటూ కోన వెంకట్ ట్వీట్ చేశారు. తాజా సమచారం ప్రకారం ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఊహించని రీతిలో గెలుపు దిశగా పయనిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌ తగిలిందని చెప్పవచ్చు

- Advertisement -