సినీ రచయిత చిన్నికృష్ణ వైసీపీలో చేరారు. పాలకొల్లులో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వేలాది మంది సమక్షంలో చిన్నికృష్ణకు కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు జగన్. చిన్నికృష్ణతో పాటు పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కూడా వైసీపీలో చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చిన్నికృష్ణ ఏపీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. తన సినిమా జీవితం రజినీకాంత్‌తో ప్రారంభమైందని.. రాజకీయ జీవితం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆరంభం అయిందన్నారు. నవరత్నాలు ఏపీలో నవధాన్యాలుగా విరాజిల్లుతాయని నమ్మి పార్టీలో చేరినట్టు వెల్లడించారు. వైఎస్ జగన్ ప్రజలకు ఏం చేస్తారో సూటిగా చెబుతున్నారని ఆయన ప్రసంగం విని చాలా మంది ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రతి పుట్టిన రోజున కలిసేవాడినని గుర్తుచేసిన చిన్నికృష్ణ వైఎస్సార్ మహానేత అన్నారు. టీడీపీ తుడిచి పెట్టుకుపోవాలంటే వైఎస్ జగన్‌ను బలపరిచి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని అన్నారు.
ఇటీవలె మెగా ఫ్యామిలీకి కౌంటరిస్తూ పవన్‌పై చిన్ని కృష్ణ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్నికృష్ణ వైసీపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.