కాంచన 3..ట్రైలర్‌ చూస్తే షాకే

292
kanchana 3 trailer
- Advertisement -

ఇప్పటివరకు ముని,కాంచన,కాంచన 2 వంటి సినిమాలతో ఓ వైపు భయాన్ని మరోవైపు నవ్వులు పూయించిన లారెన్స్‌ తాజాగా అదే సిరీస్‌లో మరోసారి రాబోతున్నారు. కాంచన 3గా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకురానున్నారు. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో వేదిక, నిక్కీ తంబోలి బిగ్ బాస్ ఫేమ్ ఓవియ హీరోయిన్లుగా నటించారు.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. హారర్ కామెడీగా సినిమా తెరకెక్కుతున్న ట్రైలర్‌లో మాత్రం హారర్ సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తాయి. రాఘవ లారెన్స్ నటన సినిమాకే హైలైట్‌గా ఉండబోతుందని చెప్పవచ్చు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి అమ్రేష్ గణేష్ సంగీతాన్ని అందించారు.

- Advertisement -