రెజ్లింగ్‌లో ప్రియా మలిక్‌కు బంగారు పతకం..

175

కేడెట్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత జూనియర్ రెజ్లర్ ప్రియా మలిక్ బంగారు పతకం కైవసం చేసుకుంది. హంగ‌రీలోని బుడాపెస్ట్‌లో ఆదివారం జ‌రిగిన 73 కేజీల విభాగం ఫైన‌ల్లో బెలార‌స్ ప్ర‌త్య‌ర్థి కెనియా ప‌ట‌పోవిచ్‌పై 5-0 తేడాతో ఆమె గెలిచింది. ఈ మ‌ధ్య కాలంలో ప్రియా మాలిక్ టాప్ ఫామ్‌లో ఉంది. 2019లో జ‌రిగిన ఖేలో ఇండియాలో ఆమె గోల్డ్ సాధించింది.

అదే ఏడాది ఢిల్లీలో జ‌రిగిన 17వ స్కూల్ గేమ్స్‌లోనూ ప్రియా గోల్డ్ మెడ‌ల్ విజేత‌గా నిలిచింది. గ‌తేడాది కూడా ఆమె రెండు గోల్డ్ మెడ‌ల్స్ సాధించింది. ఇక గురువారం జ‌రిగిన‌ ఇదే వ‌రల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియ‌న్‌షిన్ 65 కేజీల విభాగంలో మ‌రో ఇండియ‌న్ రెజ్ల‌ర్ వ‌ర్ష కూడా బ్రాంజ్ మెడ‌ల్ సాధించింది.