మరో కోలీవుడ్ హీరోతో పూజా హెగ్డే..!

47
Pooja Hedge

హీరోయిన్‌ పూజా హెగ్డే స్టార్ హీరోలందరితో జోడీ కడుతూ నెంబర్ వన్ రేసులో దూసుకెళ్తోంది. ఇప్ప‌టికే టాలీవుడ్ స్టార్ హీరోలందరితో జోడీ కడుతున్న ఈ బుట్టబొమ్మ ఇటీవల కోలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ విజ‌య్ హీరోగా రూపొందుతోన్న ‘బీస్ట్’ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

అయితే ఇప్పుడు మ‌రో క్రేజీ హీరో తెలుగులో చేస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు.. ధ‌నుష్‌. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ధనుష్‌ హీరోగా ఓ సినిమా రూపొంద‌నుందనే విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే తీసుకోవాల‌ని నిర్మాత‌లు భావించి, ఆమెతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది.