ఐ‌పి‌ఎల్ 2024 : ఆర్సీబీ..ఇక పురుషుల వంతు!

40
- Advertisement -

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ విజేత గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. ఫైనల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి కప్పు గెలుచుకుంది. ఫైనల్ లో మొదట బ్యాటింగ్ చేసిన డిల్లీ 18.2 ఓవర్లలో 113 పరుగులు చేసి స్వల్ప స్కోర్ కే ఆలౌట్ గా నిలిచింది. ఓపెనర్లు షేషాలీ 44, లానింగ్ 23 పరుగులు చేసి రాణించగా మిగిలిన వారంతా విఫలం అయ్యారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో రెండో సీజన్ విజేతగా కప్పును ముద్దడింది. ఆర్సీబీలో డివైన్ (32), స్మృతి మంధాన (31), ఎల్లిస్ పెర్రి (35) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఉమెన్స్ కోటలో ఆర్సీబీ విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి పురుషుల విభాగంపై పడింది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి కూడా కప్ వేటలో ముందంజలోనే ఉంది.

అన్నీ విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఆర్సీబీకి అదృష్టం కలిసి రావడం లేదు. ప్రతి సీజన్ లోనూ ” ఈ సాలా కప్ నమ్దే ” అంటూ ఉరిస్తున్నప్పటికి టైటిల్ మాత్రం కొట్టడం లేదు. దీంతో ఈసీజన్ లో ఎలాగైనా కప్పు సాధించాలనే పట్టుదలతో ఉంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీకి ఆడుతున్న కోహ్లీ ఒక్కసారైనా ఐపీఎల్ కప్ అందుకోవాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. ఇక ఐపీఎల్ ప్రారంభానికి ముందే మహిళల విభాగంలో ఆర్సీబీ కప్పు గెలవడం ఆ జట్టు కు కొంత ఉత్సాహాన్ని ఇచ్చే అంశం. మరి ఉమెన్స్ మాదిరి పురుషుల విభాగంలో కూడా ఆర్సీబీ విజయం సాధిస్తుందా ? లేదా ఎప్పటిలాగే నిరాశ పరుస్తుందా అనేది చూడాలి. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. మరి తొలి మ్యాచ్ లో గెలిచి ఏ జట్టు బోణి కొడుతుందో చూడాలి.

Also Read:‘ఓం భీమ్ బుష్’ క్లీన్ ఎంటర్ టైనర్:ప్రియదర్శి

- Advertisement -