కోటి 41 లక్షలు దాటిన కరోనా కేసులు..

205
america coronavirus
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు కోటి 41 లక్షల మందికి కరోనా సోకగా 5,99,416 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు కరోనా నుండి 84,70,275 మంది కోలుకోగా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో తొలిస్ధానంలో ఉంది. అమెరికాలో 36 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. సుమారు 1.37 లక్షల మంది చనిపోయారు. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. అమెరికాలో సగటున దాదాపు ప్రతి వంద మందిలో ఒకరు కరోనా బారిన పడ్డారు.

అమెరికా మొత్తం జనాభా 33 కోట్లు కాగా.. నమోదైన కేసులు 34 లక్షలు పైనే. అమెరికా తర్వాత బ్రెజిల్ 20 లక్షల కేసులతో రెండో స్ధానంలో ఉండగా మూడో స్ధానంలో భారత్ ఉంది. భారత్‌లో 10 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ప్రతిరోజు 35 వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి.

- Advertisement -