ఇదో వింత.. 74 ఏళ్ల వయసులో గుడ్డు పెట్టిన పక్షి

4
- Advertisement -

ఖచ్చితంగా ఇదో వింత అనే చెప్పవచ్చు. ప్రపంచంలోనే అత్యంత వయస్సు గల అడవి పక్షి(74) గుడ్డు పెట్టిందని అమెరికా జీవశాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పక్షి పేరు విస్డమ్. సంవత్సరానికి ఒక గుడ్డు మాత్రమే పెట్టే ఈ పక్షి జీవితాంతం సహజీవనం చేస్తాయి.

పొడవాటి రెక్కలున్న సముద్రపక్షి ఇది. లేసన్ ఆల్బాట్రాస్, హవాయి ద్వీపసమూహం యొక్క వాయువ్య అంచున ఉన్న మిడ్‌వే అటోల్ నేషనల్ వైల్డ్‌లైఫ్ రెఫ్యూజ్‌కి తిరిగి వచ్చి గుడ్డు పెట్టిందని నిపుణులు అంచనా వేశారు. విజ్డమ్, తన జంట పక్షితో కలిసి 2006 నుండి గుడ్లు పెట్టడానికి, పొదుగడానికి పసిఫిక్ మహాసముద్రంలోని అటోల్‌కు తిరిగి వచ్చారు.

పిల్లలు పొదిగిన ఐదు నుండి ఆరు నెలల తర్వాత సముద్రానికి ఎగురుతాయి. సముద్రం మీదుగా ఎగురుతూ, స్క్విడ్ మరియు చేపల గుడ్లను తింటాయి.

Also Read:అల్సర్ ఉందా.. అల్లంతో జాగ్రత్త!

- Advertisement -