- Advertisement -
100 కోచ్‌లు, 1.9-కిలోమీటర్ల పొడవు, ఇంజిన్లతో పలు ప్రత్యేకతలతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు పట్టాలెక్కింది. స్విట్జర్లాండులో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చి 175సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేయిషేన్ రైల్వే కంపెనీ 1.9కిలోమీటర్లు ఉండే ప్రయాణికుల రైలును నడిపింది. 25 కిలోమీటర్లు నడపడానికి గంట సమయం పట్టింది.
ఆల్ప్స్ పర్వత సానువుల మీదుగా ఈ రైలు ప్రయాణం సాగింది. 22 సొరంగాలు, 48 వంతెనలు, అనేక లోయలు మలుపుల్లోని దృశ్యాలను ప్రయాణికులు ఆస్వాదించారు. ఈమార్గాన్ని యునెస్కో 2008 ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
- Advertisement -