ఎవరు గెలిచినా తొలిసారే….

376
england vs new zealand
- Advertisement -

ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్‌లో ఆసీస్‌ను మట్టికరిపించిన ఇంగ్లాండ్‌ చరిత్ర తిరగరాసింది. 27 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరి టైటిల్‌కు ఒక అడుగు దూరంలో నిలిచింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది ఇంగ్లాండ్‌. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచిన ప్రపంచకప్ గెలవడం తొలిసారి అవుతుంది.

సెమీస్‌లో బౌలర్లు ఇటు బ్యాట్స్‌మెన్‌ సమష్టి రాణింపుతో సొంతగడ్డపై ఇంగ్లండ్‌ సగర్వంగా ఫైనల్లో ప్రవేశించింది. సెమీఫైనల్లో మోర్గాన్‌ సేన మరో 107 బంతులుండగానే 8 వికెట్ల తేడాతో ఆసీ్‌సను మట్టికరిపించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 49 ఓవర్లలో 223 పరుగులకు కుప్పకూలింది. స్టీవ్‌ స్మిత్‌ (85), క్యారీ ( 46) రాణించడంతో ఆమాత్రం స్కోరు చేయగలిగింది.

స్వల్ప ఛేదనలో ఇంగ్లండ్‌ 32.1 ఓవర్లలో 2 వికెట్లకు 226 పరుగులు చేసి నెగ్గింది. జేసన్‌ రాయ్‌ (65 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 85), రూట్‌ (49 నాటౌ ట్‌), మోర్గాన్‌ (45 నాటౌట్‌) రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా వోక్స్‌ నిలిచాడు.

ఐదు దశాబ్దాల ప్రపంచకప్ చరిత్రలో తొలి 5 టోర్నీల్లో మూడుసార్లు ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఇంగ్లండ్.. ఎనిమిదోసారి ప్రపంచకప్ ఫైనల్ చేరాలనుకున్న కంగారూల కలలను చిదిమేసింది. బ్యాటింగే బలంగా దూసుకొచ్చిన ఇంగ్లండ్ క్రికెట్ మక్కా లార్డ్స్‌లో ఆదివారం జరిగే ఫైనల్లో నాణ్యమైన పేస్ వనరులున్న న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. ఇప్పటి వరకు కప్పు కొట్టకపోవడంతో.. కొత్త చాంపియన్‌ను చూసే అవకాశం దక్కనుంది.

- Advertisement -