దూసుకుపోతున్న ‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్..

270
Dear Comrade

టాలీవుడ్‌ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా న‌టించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్ అనేది ట్యాగ్ లైన్ . ర‌ష్మిక మంథాన ఈ చిత్రంలో కథానాయిక‌గా న‌టించింది. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ద‌క్షిణాది మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ దక్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ భాష‌ల్లో జూలై 26న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గ‌త కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించిన సాంగ్స్ విడుద‌ల చేస్తూ మూవీపై మ‌రింత ఆస‌క్తి పెంచారు.

తాజాగా ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృంద. ఈ సినిమాలో విజయ్ మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తున్నట్టు ట్రైలర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. స్టూడెంట్ లీడర్ గా, ప్రేమికుడిగా, లక్ష్యం కోసం ప్రేమను త్యాగం చేసే వ్యక్తిగా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. కాలేజీలో హ్యాపీగా తిరుగే విజయ్ కు కోపం ఎక్కువ. రాజకీయాలు చేస్తే అసలు సహించడు. అదే సమయంలో రష్మిక పరిచయం అవుతుంది.

ఇద్దరు రిలేటివ్స్. పెద్దయ్యాక కలుసుకుంటారు. రష్మిక స్పోర్ట్స్ పర్సన్. క్రికెట్ అంటే ప్రాణం. స్టేట్ లెవల్‌కు క్రికెట్ ఆడుతుంది. ఆమెకు అండగా ఉంది లక్ష్యాన్ని సాధించే విధంగా ఉండాలని అనుకుంటాడు. అనుకోకుండా మూడేళ్లు దూరం అవుతాడు. ఎందుకు దూరం అయ్యాడు. తిరిగి వచ్చి ఎలా కలుసుకున్నాడు. అన్నది కథ. మూడు నిమిషాల ట్రైలర్‌లో సినిమా కథ మొత్తం చెప్పేశారు. కథ చెప్పినా.. ట్రైలర్ చాలా ఇంట్రెస్ట్ గా ఇంటెన్సివ్ గా ఉండటం విశేషం.ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Dear Comrade Theatrical Trailer | Vijay Deverakonda | Rashmika | Bharat Kamma | Justin Prabhakaran