ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం..

76
- Advertisement -

ఒక దేశంలో ప్రజాస్వామ్య ము సక్రమంగా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకోవాలంటే ఆ దేశములో పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలు. పత్రికా రంగము మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్ర్యము అమలవుతుంటే ఆ దేశంలో ప్రజాస్వామ్య పాలనకు, చట్టబద్దపాలనకు ఢోకాలేనట్టే. పత్రికా స్వేచ్చ ప్రతీ సమాజానికి, వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనది. పత్రికా స్వేచ్ఛను నియంత్రించడమంటే ఆ సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేయడమే. పత్రికా స్వేచ్చా పారదర్శకతను తద్వారా సుపరిపాలనను పెంపొందిస్తుంది. పత్రీకా స్వేచ్చ అవగాహన, విజ్ఞానాలను అనుసంధానం చేసే వారధి.

ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవాన్ని మే 3 వ తేదీన యునెస్కో నిర్వహిస్తుంది. ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశపు విండ హాక్ నగరంలో 1991 ఏప్రిల్ 29 నుండి మే 3 వ తేదీవరకు యునెస్కో నిర్వహించిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి పలు తీర్మానాలు చేశారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రపంచ పత్రికా దినోత్సవాన్నిడిసెంబర్ 1993లో ప్రకటించింది

ఐక్య రాజ్య సమితి 19వ ఆర్టికల్ లోనే పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. భావ స్వేచ్చ, ప్రకటన, స్వేచ్ఛగా అభిప్రాయాలను కల్గియుండటం ప్రపంచంలోని ప్రతీ పౌరుని ప్రాధమిక హక్కు. ఈ హక్కుల ఇతరుల దయా దాక్షిణ్యాలతో వచ్చినవి కావు, జన్మతో స్వతఃసిధ్ధంగా సంక్రమించినవి. రాజకీయాలలోనూ, పరిపాలనలోనూ స్వచ్ఛత విలసిల్లడానికీ, పరుగెత్తేకాలంతో సమాంతరంగా ప్రజల ముంగిటికి వార్తలు అందించే విలేకరులు ప్రతీ దినం ఎన్నో దాడులను, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. కొందరు జైళ్ల పాలవుతున్నారు, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరి వివరాలు తెల్యకుండా పోతున్నాయి.

Also Read:‘కుబేర’…నాగార్జున ఫస్ట్ లుక్

ప్రజల పక్షాన ప్రత్యామ్నాయ శక్తిగా పనిచేస్తున్న పత్రికలు చారిత్రకంగా అనేక సాధక బాధకాల మధ్య తన సామాజిక బాధ్యతను నెరవేరుస్తూ ప్రజా చైతన్యానికి పెద్దపీట వేస్తున్నాయి. అయితే పత్రికలు బాధ్యతాయుతంగా మెదులుతూ, విశ్వసనీయతను చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెజార్టీ ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేయాలి. భాగస్వామ్య పార్టీల ఒత్తిళ్లతో, ప్రతిపక్షాల ఎత్తుగడలతో సతమవుతున్న ప్రభుత్వాలకు మన పత్రికలు‘ఏజెండా’ తయారుచేసి సమర్పించే విధంగా ఉండాలి. పేదల కష్టాలను, నిరుద్యోగుల వెతలను, అధికారుల అవినీతిని ప్రభుత్వాల ముందు ఉంచాలి. దేశంలోని క్షేత్రస్థాయి సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా పత్రికలు వ్యవహరించాలి. ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కృషిచేయాలి.ప్రజలకోసం, పత్రికా స్వేచ్ఛాకోసం కృషిచేస్తున పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ, అసువులు బాసిన సంపాదకులకు, విలేకరులకు నివాళులర్పించడం మన కనీస ధర్మం.

Also Read:ఈ డ్రింక్ తో..ఆ సమస్యలన్నీ చెక్!

పత్రికా స్వేచ్ఛ అనేది ఏ దేశమూ వదులుకోలేని అమూల్యమైన హక్కు. – మహాత్మా గాంధీ

పత్రికా స్వేచ్ఛ ఒక దేశ ప్రజలది, ప్రచురణల యజమానులది కాదు – A. J. లిబ్లింగ్

- Advertisement -