వంద పదాల్లో కూడా సరిగ్గా చెప్పలేని భావాన్ని ఒక్క ఫోటో తో అర్థం చేయించవచ్చు. సామాజిక కోణం నుంచి సైన్సు కోణం దాకా.. విషయం ఏదయినా కావచ్చు ..దాని భావాన్ని మనసుకు హత్తుకునేలా చేస్తది. అదే ఫోటోగ్రఫీ. ఇవాళ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఇప్పుడున్న జనరేషన్లో ఫోటోగ్రఫీ అన్నది కామన్. మన కళ్లకు అందంగా కనబడితే చాలు దానిని వెంటనే కెమెరాలో బందిస్తున్నాం..కానీ ఓ రెండు దశాబ్దాల వెనక్కి వెళితే, అసలు ఫోటో తీయడం ఓ పెద్ద ఆర్ట్. మరీ ముఖ్యంగా కెమెరా స్వంతంగా కొనుక్కోవడం అంటే అది ఓ పెద్ద విశేషమే. ఆ కాలంలో ఫోటో తీయించుకోవడం కేవలం ధనికులకు మాత్రమే ఉన్న అవకాశం. కానీ మారుతున్న కాలం, టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ ఫోన్ అందరికీ అందుబాటులోకి రావడంతో అంతా తమ జ్ఞాపకాలను పదిలం చేసుకునే అవకాశం వచ్చింది.
1826లో ఫ్రాన్స్ లో కెమేరాతో మొదటి ఫోటో తీశారు. జోసెఫ్ నికోఫోర్ నిప్సే అనే ఆయన తన ఇంటి మెట్లమీద ఉన్న గిటికీ నుంచి ఈ ఫోటో తీసాడు. జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ అనే వ్యక్తి 1861లో మొదటి కలర్ ఫోటో తీశారు. తర్వాత డిజిటల్ ఫోటో కనుగోనడానికి అనేక సంవత్సరాలు పట్టింది. 1957లో అంటే కోడాక్ డిజిటల్ కెమెరాని కనుగొనడానికి 20 ఏళ్లకు ముందు రస్సెల్ కిర్ష్ తన కొడుకును డిజిటల్ పద్ధతిలో ఫోటో తీశాడు.
Also Read:బీఆర్ఎస్ లిస్ట్ రెడీ.. వారికే ప్రాధాన్యత?
లూయిస్ అనే వ్యక్తి మొదటి సారి మనిషి ఫోటో తీసాడు. ఈ ఫోటో తీయడానికి ఏడునిమిషాల సమయం పట్టింది. రాబర్ట్ కర్నేలియుస్ 1839లోనే సెల్ఫీ ఫోటోను తీశాడు. అంతరిక్షం నుంచి భూమిని అక్టోబర్ 24, 1946న తొలి ఫోటో తీశారు. వి-2 రాకెట్.. భూమికి 65 మైళ్ళ ఎత్తునుంచి భూమిని ఫోటో తీసింది. ఇది రాకెట్ కి అమర్చిన కెమెరా.
అయితే ఇంతటి పరిజ్ఞానం వెనుక ఎందరో శాస్త్రవేత్తల అధ్యయనాలు, పరిశోధనలు,నిరంతర కృషి దాగి ఉంది. అందుకే ఆ మహానీయుల త్యాగాలను గుర్తు చేసుకోవడమే అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే ముఖ్య ఉద్దేశం.
Also Read:ఏపీలో బండి సంజయ్ ఎంట్రీ.. వ్యూహమా?