యూరప్ వెళ్లనున్న “వరల్డ్ ఫేమస్ లవర్”

581
World-Famous-lover
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది. ఈమూవీకి వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కే.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈమూవీలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. మెయిన్ హీరోయిన్ గా రాశి ఖన్నా నటించగా.. ఐశ్వర్యా రాజేష్, క్యాతరీన్ తెరెసా, ఇసబెల్లాలు నటిస్తున్నారు.

నలుగురు హీరోయిన్లతో విజయ్ రోమాన్స్ చేస్తాడని..అందుకే టైటిల్ కు తగ్గట్టుగా అంతమంది హీరోయిన్లను తీసుకున్నారని సమాచారం. కొద్ది రోజులుగా ఈమూవీ షూటింగ్ సింగరేణి కాలనీస్ లో జరిగింది. తర్వాత షెడ్యూల్ ను యూరప్ లో తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈచిత్రయూనిట్ యూరప్ కు వెళ్లనుంది. ఈసినిమాను వచ్చే సమ్మర్ లో విడుదల చేయనున్నారు.

విజయ్ దేవరకొండ చివరగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టులేకపోయింది. ఈమూవీ తర్వాత విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే స్క్రీప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈచిత్రం పొస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పూరీ సొంత బ్యానర్ లో ఈసినిమా తెరకెక్కించనున్నారు.

- Advertisement -