టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కేదెవరికి?

26
- Advertisement -

ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో చోటు కోసం టీమిండియాలో తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. సీనియర్ ఆటగాళ్లు మొదలు కొని జూనియర్స్ కూడా చెలరేగి ఆడుతుండడంతో బెర్త్ లను కన్ఫామ్ చేయడం సెలక్టర్లకు కష్టమైన పనే అంటున్నారు క్రీడా నిపుణులు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో రాణించిన ఆటగాళ్లతో పాటు.. టీ20 స్పెషలిస్ట్ లు గా పేరు తెచ్చుకున్న వాళ్ళు సైతం అద్భుతంగా రాణిస్తున్నారు. అందువల్ల జట్టులో ప్రతి స్థానానికి ముగ్గురు పోటీ పడుతున్నారు. ఓపెనర్లలో మొదటి స్థానానికి రోహిత్ శర్మ సెట్ అయిన రెండో ఓపెనర్ స్థానానికి జైస్వాల్, గిల్, గైక్వాడ్, ఇషాన్ కిషన్ వంటి వాళ్ళు గట్టిగా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా జైస్వాల్, గైక్వాడ్ టీ20 లలో అద్బుతంగా రాణిస్తున్నారు. .

అలాగే గిల్ కూడా సమయానికి తగినట్లుగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా ఉన్న ఆటగాడే. దాంతో రెండో ఓపెనర్ ప్లేస్ కోసం గట్టిగానే పోటీ ఉంది. ఇక మిడిలార్డర్ బెర్త్ ల కోసం విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, కే‌ఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, శాంసన్, రింకూ సింగ్, జితేష్.. ఇలా గట్టిగానే పోటీ ఉంది. అల్ రౌండర్ల విభాగంలో కూడా అరుగులు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. హర్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జడేజా, శివం దూబే, శార్దూల్, సుందర్.. వంటి వారు పోటీ పడుతున్నారు. స్పిన్నర్స్ విభాగంలో కుల్దీప్, బిష్ణోయ్, చహల్.. అలాగే పేసర్స్ లలో బుమ్రా, ముఖేష్, సిరాజ్, షమి, ఆవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, చాహర్, ప్రసిద్ద్ కృష్ణ వంటివారు పోటీ పడుతున్నారు. ఓవరాల్ గా ప్రతి విభాగానికి తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఒకరిద్దరు మినహా అందరూ ఫామ్ లో ఉన్న ఆటగాళ్ళే కావడం గమనార్హం. మరి వీరందరిలో టాప్ 11 కు చేరేదెవరో చూడాలి.

Also Read:టీఎస్‌పీఎస్సీ పదవులకు భారీ దరఖాస్తులు..

- Advertisement -