వరల్డ్ కప్ లో టీమిండియా దూకుడు కొనసాగుతుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన రోహిత్ సేన.. ప్రతి మ్యాచ్ లోనూ భారీ విజయాలను నమోదు చేస్తూ వస్తోంది. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 100 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కాస్త తడబడినప్పటికి రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. రోహిత్ శర్మ (87), సూర్య కుమార్ యాదవ్ ( 49 ), కేఎల్ రాహుల్ ( 39 ) పరుగులతో రాణించడంతో తొమ్మిది వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది, ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 34 ఓవర్లలో 129 పరుగులు చేసి ఆలౌట్ గా నిలిచింది..
దీంతో రోహిత్ సేన మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పటివరకు ఆస్ట్రేలియా పై 6 వికెట్ల తేడాతో విజయం, ఆఫ్ఘనిస్తాన్ పై 8 వికెట్ల తేడాతో విజయం, పాకిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో విజయం, బంగ్లాదేశ్ పై 7 వికెట్ల తేడాతో విజయం, న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో విజయం, ఇక నిన్న జరిగిన ఇంగ్లాండ్ పై 100 పరుగుల తేడాతో విజయం.. ఇక జట్టు ఏదైనా భారీ విజయాన్ని నమోదు చేస్తూ వరల్డ్ కప్ లో తిరుగులేని జట్టుగా టీమిండియా దూసుకుపోతుంది. తాజా విజయంతో సెమీస్ కు అడుగు దూరంలో నిలిచింది. రాబోయే ఏ ఒక్క మ్యాచ్ లో గెలిచిన భారత్ సెమీస్ లో గ్రాండ్ గా అడుగు పెడుతుంది. రాబోయే మ్యాచ్లో శ్రీలంక, నెదర్లాండ్, సౌతాఫ్రికా జట్లతో తలపడాల్సి ఉంది. మరి టీమిండియా ఇదే జోరు కొనసాగిస్తుందో లేదో చూడాలి.
Also Read:శారదా పీఠంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్…