కోహ్లికి బిగ్ షాక్.. కెప్టెన్ గా రోహిత్ శర్మ?

186
Rohit Sharma

వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమి తర్వాత ఇండియా టీంలో మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తుంది. టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవి శాస్త్రీ తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఇండియా ఓడిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కోచింగ్ టీం లో మార్పుల దిశగా బీసీసీఐ కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మార్పులో భాగంగా కోహ్లిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించనున్నట్లు తెలుస్తుంది. టీ20మ్యాచ్ లలో కెప్టెన్సీ నుంచి కోహ్లి ని తప్పించి రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.

2014 చివర్లో ధోనీ నుంచి టెస్టు టీమ్ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ ఆ తర్వాత 2017లో వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలను కూడా స్వీకరించాడు. టెస్ట్, టీ20, వన్డే మ్యాచ్ లకు ఇలా మూడు ఫార్మట్ లకు కోహ్లి కెప్టెన్ వ్యవహరిస్తుండటంతో జట్టులో ఆధిపత్యధోరణి పెరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోహ్లి ఏకపక్ష నిర్ణయాలతో టీమ్ లోని కొంత మంది సీనియర్లకు ఇబ్బంది కలుగుతుందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కనీసం వన్డే జట్టు పగ్గాలన్నా రోహిత్ శర్మకి అప్పగించాలనే ప్రతిపాదనపై బీసీసీఐలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈవిషయంపై బీసీసీఐ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.