వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంది న్యూజిలాండ్. శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది కివీస్. లంక విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని 23.2 ఓవర్లలోనే చేధించింది.కాన్వే (4), రచిన్ రవీంద్ర (42), డారిల్ మిషెల్ (43) పరుగులు చేయడంతో విజయం సాధించింది.
అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. కుషాల్ పెరెరా వన్డే ప్రపంచకప్‌లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేయగా తీక్షణ 38 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కావడంతో శ్రీలంక గౌరవ ప్రదమైన స్కోరు కూడా సాధించలేకపోయింది. బౌల్ట్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో కివీస్ సెమీస్ బెర్త్ దాదాపు ఖరారు కాగా భారత్‌తో తలపడనుంది.
Also Read:ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు!