WorldCup 2023:పాక్ ఒడితే.. నాలుగు జట్లు ఔట్!

43
- Advertisement -

వరల్డ్ కప్ సెమీస్ రేస్ ఆసక్తికరంగా మారింది. వరుస విజయలతో దూసుకుపోతున్న టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా.. రెండో బెర్త్ దక్షిణాఫ్రికా దాదాపు కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక మూడు నాలుగు స్థానాల కోసం.. న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు గట్టిగా పోటీ పడుతున్నాయి. నేడు జరిగే మ్యాచ్ లలో నాలుగు జట్లు తలపడుతున్నాయి. న్యూజిలాండ్ మరియు పాక్ మద్య మ్యాచ్ ఉదయం 10 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుండగా.. మద్యాహ్నం 2 గంటలకు ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. సెమీస్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో నాలుగు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. .

ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ విజయంపై నాలుగు జట్లు ఆధారపడి వున్నాయి. న్యూజిలాండ్ పై పాక్ గెలిస్తే.. ఆ జట్టుతో పాటు అఫ్గానిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్ ఇంకా సెమీస్ రేస్ లో ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా పాకిస్తాన్ ఒడితే ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, నెదర్లాండ్ జట్లు ఇంటిముఖం పడతాయి. ఇంకా పాకిస్తాన్, శ్రీలంక జట్లకు సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారతాయి. అఫ్గానిస్తాన్ మరియు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఇంకా సెమీస్ రేస్ లో ఉండే అవకాశం ఉంది. మొత్తానికి నేడు జరిగే మ్యాచ్ లో పాకిస్తాన్ తప్పక గెలిస్తే.. సెమీస్ రేస్ లో ఉంటుంది లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. మరి ఏ జట్టు సెమీస్ ఆశలను పదిలంగా ఉంచుకుంటుందో ఏ జట్టు సంక్లిష్టం చేసుకుంటుందో చూడాలి.

Also Read:బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా ఎన్నారైల ప్రచారం..

- Advertisement -