దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తృత రూపం దాల్చుతోంది. రోజుకు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడుతున్నారు. ఓ వైపు కరోనా…మరోవైపు ఆక్సిజన్ కొరతతో ప్రజలు మృత్యువాతపడుతున్నారు.
ఈ నేపథ్యంలో భారత్‌ను ఆదుకునేందుకు ప్రపంచదేశాలు ముందుకొస్తున్నాయి. భారత్‌లో ప్రాణాలను కాపాడే వైద్య సామగ్రిని పంపుతున్నట్లు ప్రకటించింది బ్రిటన్. 9 కంటైనర్లలో వందలాది ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు, వెంటిలేటర్లు పంపినట్లు వెల్లడించింది. 495 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు,
120 నాన్-ఇన్వాసివ్ వెంటిలేటర్లు, 20 మాన్యువల్ వెంటిలేటర్లు ఇప్పటికే బ్రిటన్ నుంచి భారత్‌కు బయల్దేరగా.. మరో రెండు రోజుల్లో భారత్‌కు చేరుకోనున్నాయి. ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేసి మాట్లాడారు జపాన్ ప్రధాని సుగా యొషిహిడే. భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి గురించి ఈ సందర్భంగా ఇద్దరు నేతలు చర్చించారు. మహమ్మారి కట్టడి కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు, ప్రపంచ దేశాల నుంచి అందుతున్న సహకారం, జపాన్ తనవంతుగా చేయగలిగిన సహకారం తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. మరోవైపు అమెరికా కూడా కోవిషిల్డ్ వ్యాక్సిన్ ముడి పరికరాల తయారీలో సాయం చేస్తామని ప్రకటించింది.