సాహితీ శిఖరం…తిరునగరి రామానుజయ్య: జగదీష్ రెడ్డి

173
jaga
- Advertisement -

సాహితీ శిఖరం తిరునగరి రామానుజయ్య మృతి తీరనిలోటని ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. సంప్రదాయ సంస్కారాన్ని ఆధునిక విలువలను మేళవించి పద్యాన్ని వచన కవితను సమ ఉజ్జిగా పండించిన తిరునగరి కవితా ధార గొప్పదన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి జిల్లాలో సాహిత్య సేవ రికార్డు ఎప్పటికీ పదిలంగా ఉంటుందన్నారు. సాహిత్య లోకానికి ఆయన మరణం తీరని లోటు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -