ప్రపంచ కార్టూనిస్ట్ డే..

64
- Advertisement -

ఒక సిరా లక్ష మెదళ్లను కదిలిస్తుంది. ప్రజల్లో చైతన్యం నింపుతుంది. అయితే ప్రజలకు తాము చెప్ప దలుచుకుంది సూటిగా సుత్తిలేకుండా చెప్పడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొంతమంది కవిత రూపంలో తెలియజేస్తే మరికొంతమంది కార్టూన్స్ రూపంలో తాము చెప్పదలుచుకున్న సందేశాన్ని చెబుతారు. అలా ఎంతోమంది కార్టూనిస్టులు ప్రపంచంలో పాపులర్ అయ్యారు. ఇవాళ ప్రపంచ కార్టూనిస్ట్ డే సందర్భంగా వారిని గుర్తుచేసుకుంటూ.

వాస్తవానికి 1995 నుండి ప్రపంచ కార్టూనిస్ట్ డేని నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ వరల్డ్ పేజీల్లో మొట్టమొదటి కమర్షియల్ కార్టూన్ వేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో గుస్ ఎడ్సన్, ఒట్టో సోగ్లో, క్లారెన్స్ డి. రస్సెల్, బాబ్ డన్ వంటి గొప్ప కార్టూనిస్టులు తమ మేధస్సుకు పదును పెట్టారు.

Also Read:హ్యాపీ బర్త్ డే..కృష్ణ పూనియా

ఒక కార్టూన్ మనిషిని కదిలిస్తుంది. ఆలోచన పుట్టిస్తుంది. నవ్వు తెప్పిస్తుంది. అయితే కార్టూన్ వేయడం అంత సులువు కాదు. కొన్ని సామాజిక మార్పును ప్రేరేపిస్తే.. కొన్ని వ్యంగ్యాన్ని జోడిస్తాయి. ఎన్నో అంశాలను తమ కార్టూన్ల ద్వారా ప్రశ్నిస్తూ, ఆలోచింప చేస్తున్నారు. ప్రపంచ కార్టూనిస్టు డే సందర్భంగా కార్టూనిస్టులకు మరింత గుర్తింపు రావాలని greattelangaana.com కొరుకుంటోంది.

Also Read:కార్ల్ మార్క్స్…జయంతి

- Advertisement -