ఒలంపిక్ పతక విజేత పీవీ సింధు కూడా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్ మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ షట్లర్ పీవీ సింధు అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి చైనా షట్లర్ సన్‌యూపై 21-14, 21-9తో సింధు గెలుపొందింది. దీంతో సింధు వరల్డ్ ఛాంపియన్‌షిప్ సెమీస్‌లోకి చేరింది. సెమీస్‌కు చేరిన పీవీ సింధుకు పతకం ఖాయం అయినట్లే.! గతంలో రెండు సార్లు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం అందుకుంది. తాజాగా సింధుకు మూడో సారి పతకం ఖాయం చేసుకుంది.
ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ కూడా సింధునే. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం సింధు నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక క్వార్టర్ ఫైనల్‌లో సైనా నెహ్వాల్ స్కాట్లాండ్ క్రీడాకారిణి గిల్‌మార్‌పై 21-19, 18-21, 21-15 తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగే సెమీస్‌ల్లో సైనా, సింధు విజయం సాధిస్తే ఆదివారం జరిగే ఫైనల్‌లో వీరిద్దరూ తలపడే అవకాశం ఉంది.