Asthama:ప్రపంచ ఆస్తమా దినోత్సవం

56
- Advertisement -

అస్తమా దీర్ఘకాలిక శ్వాససంబంధ వ్యాధుల్లో ఒకటి. ప్ర‌పంచంలో ఉన్న సుమారు 15-20 % జ‌నాభా ఈ శ్వాస‌కోస వ్యాధితో బాధ‌ప‌డుతున్నావారే. దీనిని నిర్లక్ష్యం చేస్తే మరణం కూడా సంభవించవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా అస్తమా లేదా ఉబ్బసం పట్ల అవగాహన కల్పించేందుకు గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా (GINA)కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి సంవత్సరం మే నెల మొదటివారంలో ప్రపంచ అస్తమా దినోత్సవంను నిర్వహిస్తున్నారు.

ద‌గ్గు,ఛాతి బిగిసిపోవ‌డం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది మ‌రియు నిద్ర‌లో గుర‌క‌పెట్ట‌డం వంటివి ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు. సాధార‌ణంగా కుటుంబ‌లో ఎవ‌రికైనా నాస‌ల్ లేదా స్కిన్ అలెర్జీలు ఉన్న ఈ వ్యాధి సోకే అవ‌కాశం ఉంది. మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి మ‌ర‌లా బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల కూడా నాళాలు సన్నబడతాయి. దీని వల్ల గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా మ‌న‌కు వెంట‌నే ఆయాసం వచ్చేస్తుంది. ఇవన్నీ అస్తమా వ్యాధి లక్షణాలు.

5 నుంచి 11 ఏళ్ల వయసు పిల్లల్లో 5 శాతం నుంచి 15 శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఆస్త‌మా వ్యాధిని పూర్తిగా నివారించ‌లేం. కానీ స‌రైన చికిత్సా విధానం పాటిస్తే చాలా వ‌ర‌కు కంట్రోల్ చేయవచ్చు. ఆస్తమా ఉన్నవాళ్లు వ్యాయామం చేయ‌డం చాలా మంచిది. వ్యాయామం చేయ‌డం వ‌ల‌న ఆస్త‌మా ఎటాక్స్ త‌గ్గే అవ‌కాశం ఉంది. వ్యాయామంతో రక్తప్రసరణ పెరిగి, కేలరీలు వినియోగమై బరువు తగ్గుతారు. బరువు తగ్గేకొద్దీ ఆస్తమా రిస్కు క్ర‌మేపీ తగ్గుతుంది. రక్తప్రసరణ పెరగడం వల్ల మంచి ఆక్సిజన్‌ అంది శ‌రీరంలో ఉండే అవ‌య‌వాల‌న్నీ శ‌క్తివంతంగా త‌యార‌వుతాయి. త‌ద్వారా అలర్జీలనే కాదు, ఇన్‌ఫెక్షన్లను కూడా తట్టుకోగలుగుతారు.

Also Read:Modi:రాష్ట్రానికి ప్రధాని..ట్రాఫిక్ ఆంక్షలు

ఆస్తమా ఉన్న వారు సమస్య మరింత తీవ్రం కాకుండా ధూమనానానికి దూరంగా ఉండాలి. దుమ్మూదూళికి దూరంగా ఉండాలి.శీతల పానీయాలు, ఐస్‌క్రీములు, ఫ్రిజ్‌వాటర్ వంటి పడని పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో బూజు దులపడం వంటివి ఆస్తమా ఉన్నవారు చేయకూడదు.చలికాలం, పెంపుడు జంతువులు, వాటి ఉన్ని, గాలిలోని రసాయనాలు , ఘాటు వాసనలు, అతిగా చేసే శారీరక శ్రమ ఆస్తమా తీవ్రత పెరగడానికి కారణమవుతాయి.

అందువ‌ల‌న ఆస్త‌మా వ్యాధితో బాధ‌ప‌డుతున్న అంద‌రూ ఖ‌చ్చితంగా ఈ వ్యాధి యొక్క లక్ష‌ణాలు మ‌రియు నివార‌ణ చ‌ర్య‌ల గురించి తెలుసుకొని ఈ వ్యాధిని వీలైనంత వ‌ర‌కు నియంత్రించుకునేలా జాగ్ర‌త్త‌లు తెలుసుకోవాలి.

Also Read:Janasena:పవన్ కోసం కదిలిన చిరు

- Advertisement -