Karnataka:డీకే..ట్వీట్ వైరల్

11
- Advertisement -

కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం కుర్చీ వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యాక సిద్దరామయ్య పదవి విడిచి, తాను సీఎం కావాలనే డిమాండ్ ఉందన్న ఊహాగానాల నడుమ డీకే శివకుమార్ చేసిన ఈ పోస్ట్ మరింత చర్చ పెంచింది.

సీఎం పదవిపై తన హక్కును చాటుతున్న ఆయన చేసిన ఈ వ్యాఖ్య కాంగ్రెస్ హైకమాండ్‌పై నేరుగా కాకపోయినా సంకేతంతో చేసిన విమర్శగా కనిపించింది. ఎక్స్ వేదికగా WORD POWER IS WORLD POWER. ప్రపంచంలోనే అత్యంత శక్తి అంటే మాట నిలబెట్టుకోవడం. న్యాయమూర్తి కావొచ్చు, రాష్ట్రపతి కావొచ్చు, నేను సహా ఎవ్వరైనా కావొచ్చు — మాట ఇచ్చినవారు మాట నిలబెట్టుకోవాలి. Word power is world power అని పేర్కొన్నారు.

శివకుమార్ తమ అనుచరులకు తాను తదుపరి సీఎం కావాలని స్పష్టంగా చెబుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.సీఎంసీటుకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్‌లో ఐదుగురు లేదా ఆరుగురి మధ్య రహస్య ఒప్పందం జరిగిందని…దాన్ని బహిరంగంగా మాట్లాడలేనని, అలా చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని తెలిపారు. అలాంటి ఒప్పందం ఉందన్న ఊహాగానాలు మరింత పెరిగాయి.

సీఎం సిద్దరామయ్య, తాను కొనసాగుతానని అంటూనే కేబినెట్ రీషఫుల్‌పై సూచనలు చేశారు. శివకుమార్ అనుచరులు మాత్రం ఆయన పదవి కోసం ఢిల్లీ–కర్ణాటకల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం ఈ వివాదంపై స్పందించారు. సీఎం మార్పు గురించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.కర్ణాటక ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో కర్ణాటక ప్రజలే చెప్పగలరని వ్యాఖ్యానించారు.

Also Read:యునెస్కోలో అంబేద్కర్ విగ్రహం..మోదీ హర్షం

 

- Advertisement -