సెమీఫైనల్లో చిత్తైన భారత్..

48
- Advertisement -

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్ కథ ముగిసింది. ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆసీస్ విధించిన 173 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్…20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 167 పరుగులు చేసి ఓటమిపాలైంది.

ఓపెనర్లు షఫాలీ శర్మ(9), స్మృతీ మందాన(2), యస్తికా భాటియా(4) విఫలమైనా జెమీమా రోడ్రిగ్స్ 43(24 బంతుల్లో), హర్మన్ ప్రీత్ 52(34 బంతుల్లో) ఆదుకున్నారు. అయితే చివరలో హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ కావడంతో భారత్ ఓటమి తప్పలేదు.

ఇక అంతకముందు తొలతు టాస్ గెలిసిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బెత్ మూనీ 54, కెప్టెన్ మెగ్ లానింగ్ 49 (నాటౌట్), ఆష్లే గార్డనర్ 31, అలీసా హీలా 25 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో శిఖా పాండే 2 వికెట్లు తీసింది. దీప్తి శర్మ, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -