ఆసియా కప్‌ను 7వ సారి ముద్దాడిన భారత మహిళలు

209
- Advertisement -

ఆసియాకప్‌ ట్రోఫీని భారత మహిళల జట్టు మరోసారి ముద్దాడింది. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి సగర్వగా ట్రోఫీని అందుకొంది. ఆసియా కప్‌ ఆసాంతం రాణించిన భారత మహిళల జట్టు ఫైనల్లోనూ చెలరేగింది. ఆసియాకప్‌ ఫైనల్లో ఇండియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై సునాయస విజయాన్ని నమోదు చేసింది. 66 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. కేవలం 8.3 ఓవర్లలోనే ఆ టార్గెట్‌ను చేధించింది.

స్మృతి మందానా సూపర్‌ హిట్టింగ్‌తో లక్ష్యాన్ని సులభతరం చేసింది. మందానా అజేయంగా 51 పరుగులు చేసి…ఆసియాకప్‌ను ముద్దాడటంలో కీలకపాత్రను పోషించింది. ఇండియా మహిళల జట్టు ఆసియాకప్‌ను గెలవడం ఇది ఏడోసారి కావడం విశేషం.

తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లల్లో కేవలం 9 వికెట్లకు 65 పరుగులు మాత్రమే చేసింది. ఇండియన్‌ బౌలర్‌ రేణుకా సింగ్‌ ఠాకూర్‌ తన బౌలింగ్‌ ప్రతిభతో లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. ఆమె మూడు ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నది. రాజేశ్వరి గైక్వాడ్‌, స్నేహ రాణాలు చెరో రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఆరంభం నుంచి భారత బౌలర్లు లంక బ్యాటర్లను కట్టడి చేశారు.

- Advertisement -