ఆ ఇద్దరు ఎవరో..!

198
trs mlas
- Advertisement -

తుది దశ కేబినెట్ విస్తరణలో ఇద్దరు మహిళలకు స్ధానం కల్పిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకోగా ముఖ్యంగా టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల్లో ఆశలు రేకేత్తిస్తోంది.

ప్రస్తుతం అసెంబ్లీలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ముగ్గురు,మండలిలో ఇద్దరు మహిళా ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో పద్మా దేవేందర్‌ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే కాగా ఆమె డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. ఇక గొంగిడి సునీత,రేఖా నాయక్‌ ఇద్దరు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శాసన మండలిలో ఆకుల లలిత ,కొత్తగా మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ఉండగా ఆకుల లలిత ఇటీవలె కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు.

సామాజిక సమీకరణాలే కీలకంగా మంత్రివర్గ విస్తరణలో మహిళలకు స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. వీరిలో పద్మా దేవేందర్ రెడ్డి,గొంగిడి సునీత ఇద్దరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఎస్టీ కోటాలో రేఖానాయక్‌,సత్యవతి రాథోడ్ పోటీ పడుతున్నారు. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్యవతి తర్వాత టీఆర్ఎస్లో చేరారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆకుల లలిత 2008-09లో ఎమ్మెల్యేగా ఉన్నారు. 2015లో ఎమ్మెల్సీ పదవి పొందారు.

మంత్రివర్గంలో ఎస్టీలు ఎవరూ లేనందున రేఖానాయక్‌, సత్యవతిలలో ఒకరికి స్థానం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఓసీ లేదా బీసీకి స్ధానం కల్పిస్తే పద్మ, సునీతాలలో ఒకరికి, బీసీ కేటగిరిలో లలితకు అవకాశం దక్కేవీలుంది. మొత్తంగా కేసీఆర్‌ ప్రకటనతో ఆశావాహులు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు.

- Advertisement -