కేసీఆర్ విజన్‌..దేశానికే ఆదర్శం:ఎంపీ కవిత

253
kerala
- Advertisement -

కాంగ్రెస్‌,బీజేపీ 75 ఏళ్ల పాలనలో భారత్‌ అభివృద్ధి వైపు అడుగులు వేయలేదన్నారు ఎంపీ కవిత. భారతదేశం అన్నిరంగాల్లో పురోగమించేలా బలమైన నాయకత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. కేరళ అసెంబ్లీ వజ్రోత్సవాల సందర్భంగా Cast and it’s Discontents అనే అంశంపై ప్రసంగించిన కవిత తెలంగాణ యావత్ దేశానికే రోల్‌ మోడల్‌గా మారిందన్నారు.

తెలంగాణలో తాగు, సాగు నీటి వనరుల పునరుజ్జీవనం వినియోగం కోసం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్నట్లు కవిత తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రపంచంలోనే బెస్ట్ పాలసీ అనే ప్రశంసలు అందుకుంటోందని కవిత తెలిపారు. అభివృద్ధి వికేంద్రికరణలో భాగంగా అన్నిజిల్లాలకు ఐటీని విస్తరిస్తున్నామని చెప్పారు.

60 ఏళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రజలు హరిగోస పడ్డారని కానీ నేడు స్వరాష్ట్రంలో ఆ బాధలు తీరాయన్నారు. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు రైతు బంధు,వారు ఎలా చనిపోయిన రైతు బీమా అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి రైతులకు పంటసాయం చేయాలన్న ఆలోచన చేయలేదని కేసీఆర్‌ విజన్‌కు ఇది నిదర్శనమన్నారు.

రాజకీయ పార్టీలకు, నాయకులకు కమిట్మెంట్ ముఖ్యమని అదే దేశానికి రక్ష అని అన్నారు. దేశ భవిష్యత్తు యువతరంపైన ఉందని ముఖ్యంగా చైతన్యవంతమైన సమాజ నిర్మాణానికి యువత, విద్యార్థులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -